‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈలోగా హౌస్ మేట్స్ ఇంకా ఎవరన్నా మాస్క్ లోనే ఉన్నారా? అని సోధించే పనిలో ఉన్నాడు బిగ్ బాస్. అందులో భాగంగానే చాలా రకాల టాస్కులు ఇస్తున్నాడు. తాజాగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలు ఇంట్లోని సభ్యులను బాగానే ఆలోచింపజేశాయి. ఇరకాటంలో పడేశాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి టాప్- 5 ఎవరు? విన్నర్ ఎవరు? అయితే ప్రస్తుతం మాత్రం ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అన్న దాని గురించే ఆలోచన ఎక్కువగా ఉంది. అందరూ మొదటి నుంచి కాజల్ అనుకున్నారు. తర్వాత సిరి వైపు మళ్లారు. ప్రస్తుతం షాకింగ్ గా షణ్ముఖ్ జశ్వంత్ పేరు వినిపిస్తోంది.
ఓట్ల పరంగా షణ్ముఖ్ జశ్వంత్ టాప్ 1, 2 ప్లేసుల్లో కొనసాగుతున్నాడని టాక్. మరి, అలాంటి షణ్ముఖ్ ను ఎందుకు ఎలిమినేట్ చేస్తారనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే రవి ఎలిమినేట్ అయ్యే సమయంలో ఓటింగ్ లో రవి మూడో స్థానంలో ఉన్నాడని టాక్ వినిపిచింది. ఇప్పుడు బిగ్ బాస్ అదే పని చేయబోతున్నాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో అనేది ఇప్పుడే చెప్పలేం.
షణ్ముఖ్ మాత్రం సిరి విషయంలో చాలానే నెగెటివిటీని మూట కట్టుకున్నాడు. ముఖ్యంగా గత రెండు వారాలుగా అతని ప్రవర్తన సగటు ప్రేక్షకులు కోప గించుకునే ఉంది. మరోవైపు సిరి కూడా షణ్ముఖ్ తో ఉంటూ ఆమె కూడా బాగానే నెగెటివిటీని పొందింది. అయితే ఆ ఒక్క కారణంతో షణ్ముఖ్ ను ఎలిమినేట్ చేస్తారా? అనేది అసలు ప్రశ్న. అసలు ఏ కారణం లేకుండా రవిని ఎలిమినేట్ చేసినవాళ్లు.. చిన్నదో పెద్దదో ఒక కారణం ఉంది కదా అని అడుగుతున్నారు.
మరోవైపు షణ్ముఖ్ బ్రదర్ చేసిన ఆరోపణలు కూడా ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. షణ్ముఖ్ కావాలనే నెగెటివ్ చేస్తున్నారని అంటున్నాడు. ఇంత కాలం మాట్లాడని వాళ్లు ఇప్పుడు మాకు బిగ్ బాస్ ఏమీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పుకొచ్చారు. అయితే టైటిల్ విన్నర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన షణ్ముఖ్ టాప్ 6గా ఎలిమినేట్ అవుతాడంటే అదే జరిగే పని కాదు. ఇవన్నీ పుకార్లో, నిజాలో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు ఆగాల్సిందే. షణ్ముఖ్ జశ్వంత్ ఎలిమినేట్ కాబోతున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.