‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్ల కోసం టాస్కులు నడుస్తున్నాయి. మొదటి ఫైనలిస్టుగా సింగర్ శ్రీరామ్ తన ప్లేస్ ను ఖాయం చేసుకున్నాడు. ఇంకా నలుగురికి అవకాశం ఉంది. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం హౌస్ లో శ్రీరామచంద్ర, సిరి నడవలేని స్థితిలో ఉన్నారు. టికెట్ టూ ఫినాలే టాస్కులో భాగంగా మొదట ఐస్ లో నిల్చోబెట్టారు. ఆ రోజు ఇంట్లోని సభ్యులు అందరికీ పాదాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో వేడి నీళ్లు వాడకూడదని హెచ్చరించారు కూడా. అయినా ప్రియాంక సింగ్ శ్రీరామ్ పాదాలపై వేడినీళ్లు పోసింది. ఆ దెబ్బతో శ్రీరామచంద్ర మంచానికే పరిమితమయ్యాడు.
అలాంటి వైద్యమే ఒకటి సిరిపై కూడా ప్రయోగించాలని చూడగా.. అందుకు బిగ్ బాస్ అడ్డుపడ్డాడు. హౌస్ లో సిరి ఇప్పుడు మోషన్స్ తో బాధ పడుతోంది. ఆ బాధను ప్రియాంకతో పంచుకోగా.. మొదట అరటిపండు తిను అని చెప్పింది. ఆ తర్వాత పంచదార తిను తగ్గిపోతాయంటూ సలహా ఇచ్చింది. ఇంకొకరు కూడా మళ్లీ మంచానికి పరిమిత మౌతారనే భయంతో బిగ్ బాస్ వెంటనే కలుగజేసుకుని ప్రియాంక సింగ్ ను వారించారు. ‘ప్రియాంక సింగ్ మీ మీద కానీ, ఇంట్లోని సభ్యుల మీద కానీ.. మీ సొంత వైద్యాన్ని ఉపయోగించకండి’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ దెబ్బతో హడలిపోయిన ప్రియాంక ‘బిగ్ బాస్ ఇలా అనౌన్స్ చేసి నా గాలి తీసేశారు. ఇలా అయితే డాక్టర్ ప్రియాంక ఏమై పోవాలి?’ అంటూ స్పందించింది.