బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ కటుంబసభ్యులు ఇంట్లోకి వచ్చారు. ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా వాళ్ల పార్ట్ బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ టీఆర్పీ పెంచే పార్ట్ రానే వచ్చింది. అదే సిరి- శ్రీహాన్ లవ్ పార్ట్ అనమాట. సిరి ఎప్పుడెప్పుడు హౌస్‌లోకి అడుగుపెడుతుందా అని అంతా ఎదురుచూశారు. అందరూ అనుకున్నట్లే సిరి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరాగానే శ్రీహాన్‌ను ముద్దులతో ముంచెత్తింది. సిరిని చూడగానే శ్రీహాన్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఏడవకు ఏడవకు అంటూ సిరి హన్మంత్ శ్రీహాన్‌ని ఓదార్చుతుంది. బిగ్ బాస్ రిలీజ్ అనగానే శ్రీహాన్ తన ప్రేయసిని గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అవుతాడు.
ఇంక సిరి తనదైన స్టైల్‌లో ఇంట్లోని సభ్యులపై జోకులు, కౌంటర్లు వేసేసింది. నిన్న ఎప్పుడూ చీకీ ఫేస్ అని శ్రీహాన్ అంటూ ఉంటాడు అంటూ రేవంత్ కంప్లైంట్ ఇచ్చాడు. అందుకు శ్రీహాన్ తర్వాత క్యూట్‌గా ఉంటుంది అని కూడా చెప్పా కదా అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించగా.. నువ్వు శ్రీసత్యను అంటావ్‌లే నన్ను కాదు అంటూ కౌంటర్ వేసింది. శ్రీసత్యనేమో.. అప్పుడప్పుడు శ్రీహాన్‌ని ఏడిపిస్తూ ఉంటాం.. ఏం అనుకోకు అంటూ కామెంట్ చేస్తుంది. అందుకు సిరి వెంటనే.. ఏడిపించకు నేను అనుకుంటాను అంటూ కౌంటర్ వేస్తుంది. పాపం శ్రీసత్య ముఖం మాడిపోతుంది. అయితే సిరి ఈసారి ఇనయాకి కౌంటర్ వేసింది. ఏంటి ఈ మధ్య మావాడి మీద కాన్సన్‌ట్రేట్ చేయట్లేదు అంటూ అడుగుతుంది. అందుకు ఇనయా సుల్తానా నవ్వుతూ ఊరుకుంటుంది.
ఇంక శ్రీహాన్‌ను కళ్లు మూసుకోమని.. అతని పేరుని టాటూ వేయించుకున్న విషయాన్ని శ్రీహాన్‌కు చూపిస్తుంది. అది చూసి శ్రీహాన్ నోట మాటరాలేదు. చూస్తూ ఉండిపోతాడు. ఈ గ్యాప్‌లో హౌస్‌లోకి శ్రీహాన్- సిరి కొడుకు చైతన్య ఎంట్రీ ఇస్తాడు. ఇంట్లో ఇంక మామూలు అల్లరి కాదు. ఇంట్లో ఉన్న సభ్యులు మొత్తాన్ని పలకరిస్తూ గోలగోల చేశాడు. ఒక్కొక్కళ్లు ఏం మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు అంటూ చెప్పాడు. ఆదిరెడ్డి గురించి అడగగానే.. ఐ లవ్ యూ కవిత అంటూ చెప్పగానే ఇల్లు మొత్తం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోతుంది. అలాగే రేవంత్‌ని, ఇనయాని ఇలా అందరి గురించి వాళ్లు ఏం మాట్లాడుతారో చెబుతూ బాగా అల్లరి చేశాడు. వీళ్ల ఫ్యామిలీ పార్ట్ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ కచ్చితంగా గిట్టుబాటు అవుతుంది.
అయితే సిరి హన్మంత్– శ్రీహాన్ గురించి తెలియని వాళ్లు.. ఇంకా వాళ్లకి పెళ్లి కాలేదు, లివ్ ఇన్ రిలేషన్‌లోనే ఉన్నారు. మరి.. ఇంత పెద్ద బాబు ఎలా వచ్చాడు? వాళ్లని మమ్మీ- డాడీ అ పిలుస్తున్నాడు ఏంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాళ్లని సోషల్ మీడియాలో ఫాలో అయిన వాళ్లకి, సిరి ఉన్న బిగ్ బాస్ సీజన్ చూసిన వాళ్లకు ఓ క్లారిటీ ఉంది. అయితే ఆ పిల్లాడు ఎవరంటే.. అతను సిరి హన్మంత్ వాళ్ల సొంత మేనమాన కొడుకు. అయితే ఆ విషయాన్ని స్వయంగా సిరి వాళ్ల అమ్మే వెల్లడించారు. అప్పట్లో నాకు ఒక బాబు ఉన్నాడు అనగానే చాలా వార్తలు వచ్చాయి. అందుకే వాళ్ల ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. సిరి దగ్గర పెరిగేది నా తమ్మడు కొడుకే అని చెప్పుకొచ్చారు. సిరి కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు వైరల్ అయిన ఈ చైతన్య అలియాస్ చైతు.. మరోసారి బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ తో వైరల్ అయ్యాడు. తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు.