పైన కనిపిస్తున్న యువతి పేరు సుచిత్ర. వయసు 25 ఏళ్లు. బీఫార్మసీ పూర్తి చేసిన ఆమె బెంగుళూరులో పని చేస్తుంది. కూతురు చిన్న వయసులోనే మంచి ఉద్యోగంలో స్థిరపడడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. ఇక సుచిత్రకు పెళ్లి వయసు రావడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. దీని కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కూతురు ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయింది. ఇక తాను చనిపోయి చివరికి మరొకరికి ప్రాణం పోయాలనుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. సుచిత్ర ఎలా చనిపోయింది? అసలు ఇంతకు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్ ప్రాంతం. ఇక్కడే నరసింహులు, అనురాధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రూపశరణ్య, సుచిత్ర అనే ఇద్దరూ కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు రూపశరణ్య బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుండగా, చిన్న కూతురు సుచిత్ర బీఫార్మసీ పూర్తిచేసి బెంగుళూరులో ఉద్యోగం చేస్తుంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 31న సుచిత్రకు తల నొప్పిగా ఉండడంతో వెంటనే ఆమె ప్రొద్దుటూరుకు తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆ నొప్పి రోజు రోజుకు తీవ్ర కావడంతో సుచిత్ర తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రిలో చూపించగా… ఆమెకు మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. దీంతో ఖంగారుపడ్డ సుచిత్ర తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ కు తీసుకొచ్చి ఓ ప్రముఖ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి సుచిత్ర బ్రెయిన్ డెడ్ తో ఇటీవల ప్రాణాలు కోల్పోయింది.
కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే ఇక్కడే సుచిత్ర సేవ గుణాన్ని మనం మెచ్చుకోవాలి. ఒకవేళ తాను చనిపోతే నా శరీరంలోని అవయవాలను దానం చేయాలని ముందే నిర్ణయం తీసుకుని రిజిష్టర్ చేయించుకుంది. ఇదే విషయాన్ని సుచిత్ర తల్లిదండ్రులు వైద్యులకు చెప్పడంతో వారు ప్రత్యేక వైద్య బృందంతో సుచిత్ర శరీరం నుంచి గుండె, వెన్నుముక, మూత్రపిండాలు తీసి భద్రపరిచారు. తాను చనిపోయినా మరొకరికి ప్రాణం పోయాలనుకున్న సుచిత్ర నిర్ణయంపై వైద్యులు సైతం మెచ్చుకుంటున్నారు. అనంతరం కూతురు మృతదేహాన్ని తీసుకెళ్లి సుచిత్ర తల్లిదండ్రులు అంత్యక్రియలు జరిపారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. తాను చనిపోయి మరొకరికి ప్రాణం పోయాలనుకున్న సుచిత్ర నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.