ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. బాధితులు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని వెంటనే స్పందించి.. బాధితులకు సత్వరం నాయ్యం జరిగేలా చూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా ఓ మహిళ కాల్ చేసి.. తాను అత్తగారింట్లో ఎదుర్కొంటున్న బాధల గురించి తెలిపింది. ఆమె సమస్యలు విన్న ఎస్పీ.. బాధితురాలికి సాయం చేస్తానని హామీ ఇవ్వడమే కాక వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చూడండి.