ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. సందేశాత్మక కథలను కమర్షియలైజ్ చేసి తెరకెక్కించడంలో ఈయన ఆరితేరిపోయాడు. ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలు నాలుగే. 2013లో ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలను తెరకెక్కించాడు. ఈ నాలుగు విజయం సాధించాయి. కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.
‘వ్యక్తిగత విషయాలను, తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా ప్రతి అప్‌డేట్ అందిస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉంటాను. మీడియా చానళ్లు, పత్రికల ద్వారా మనం కలుస్తూనే ఉంటాం. దీనివల్ల మీడియం మారిందే తప్ప మన మధ్య బంధంలో మార్పు ఉండదు’ అంటూ కొరటాల ట్వీట్ చేశాడు.
ఇక డైరెక్టర్‌గా కూడా తర్వలోనే రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు ఇటీవల కొరటాల బర్త్‌డే సందర్భంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త వాళ్లు రావాలంటే ఉన్న దర్శకులు రిటైర్ కావాలంతే అంటున్నాడు. ఇండస్ట్రీలో కొనసాగినా కూడా దర్శకత్వం వైపు మాత్రం వెళ్లనని చెప్పాడు. నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉందని మాత్రం తెలిపాడు ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం పూర్తికాగానే ఆయన ఎన్టీఆర్ హీరోగా కొత్త సినిమా పనులు మొదలు పెడతారు.
— koratala siva (@sivakoratala) June 25, 2021