గొప్ప మనసు అనేది ప్రదర్శించేది కాదు.. అవసరం ఉన్నపుడు అదే బయటకు వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. అవును! ఇది అక్షర సత్యం.. గొప్ప మనసు ఉందని ప్రచారం చేసుకోవటానికి.. తమ గొప్ప మనసును ప్రదర్శించటానికి.. ఎదుటి వ్యక్తికి మన అవసరం ఉన్నపుడు గొప్ప మనసు చాటుకోవటానికి చాలా తేడా ఉంది. నేటి సమాజంలో అతికొద్ది మందికి మాత్రమే మంచి మనసు కలిగి ఉన్నారు. చాలా అరుదుగా మాత్రమే ఆ మంచి మనసు గురించి సమాజానికి తెలుస్తోంది. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఏదో ఒక గొప్ప విషయం జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, ఓ లేడీ కానిస్టేబుల్ తన మంచి మనసును చాటుకుంది.
పరీక్ష కేంద్రంలో ఓ చిన్నారికి జోల పాడి నిద్రపుచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రాజంపేటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. రాజంపేటకు చెందిన ఓ మహిళ పరీక్ష రాయటానికి భర్త, నాలుగు నెలల కుమారుడు, తల్లితో కలిసి అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజ్‌కు వెళ్లింది. పరీక్ష టైం కావటంతో భర్త, తల్లికి బిడ్డను అప్పగించి లోపలికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తల్లి వెళ్లగానే బిడ్డ ఏడుపు లంఖించుకున్నాడు. అరగంట అయినా బిడ్డ ఏడుపు ఆపలేదు. మహిళ భర్త, తల్లి ఎంత ప్రయత్నించినా.. ఏమి చేసినా బిడ్డ ఏడుపు ఆపలేదు. ఆ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న లేడీ కానిస్టేబుల్ అమరావతి వారిని చూసింది.
వారి దగ్గరకు వెళ్లి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది. బిడ్డను ఎంతో లాలనగా బుజ్జగించింది. దీంతో బిడ్డ ఏడుపు ఆపాడు. ఆ వెంటనే ఆమె ఓ అరుగుపై కూర్చుని బిడ్డను తన ఒడిలో పెట్టుకుని జోలపాడింది. దీంతో బాబు నిద్రపోయాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది ఆమెను ప్రశంసించారు. ఇక, ఇలాంటి ఘటన ఒంగోలులో కూడా జరిగింది. ఓ లేడీ కానిస్టేబుల్ ఓ చిన్నారికి పాలు పట్టి మంచి మనసు చాటుకుంది. కన్న తల్లిలా ఎంతో ప్రేమగా ఆ బిడ్డను చూసుకుంది. మరి, ఈ రెండు ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We Serve With Pride And Care-#APPolice:A female candidate who came to SSN Engineering College to appear for #Constable Preliminary #exam,left her 6 months old #baby with her husband&went inside to take the exam.After a while the baby’s cry became louder & as the husband(1/3) pic.twitter.com/ZFbXmReq2z
— Andhra Pradesh Police (@APPOLICE100) January 22, 2023