ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శుక్రవారం ఉదయం విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం అయింది. దేశంలోని ప్రముఖ వ్యాపార వేత్తలంతా ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కూడా ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్‌కు వచ్చారు. ప్రత్యేక కాన్వాయ్‌లో అక్కడకు వచ్చారు. మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఎంతో ఆప్యాయంగా ముఖేష్‌ను పలకరించారు. ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కొద్ది సేపు మాట్లాడుకున్నారు.
అనంతరం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రితో పాటు ముఖేష్ అంబానీ కూడా జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నారు. ముఖేష్ అంబానీ సౌత్‌లో ఓ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు రావటం ఇదే మొదటిసారి. సౌత్ ఇండియాలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమానికి రాలేదు. ఇప్పుడు మాత్రం తన 17 మంది బోర్డు డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, మొత్తం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనటానికి 12 వేలకు పైగా రిజిస్ట్రేషన్స్ నమోదు అయ్యాయి. ఇప్పటికే సంజీవ్ బజాజ్, నవీన్ జిందాల్, జీఎంరావు, జీఎంఆర్, ప్రీతారెడ్డి, కరణ్ అదానీ వంటి బడా వ్యాపార వేత్తలు వచ్చారు.
యూకే డిప్యూటీ హైకమిషనర్ కూడా సమ్మిట్‌కు వాచ్చారు. నిన్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై కేటీఆర్ స్పందించారు. ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న మా సోదర నగరం వైజాగ్‌కు.. మా సోదరి రాష్ట్రం ఏపీకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. వారికి శుభం కలగాలి. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే బెస్ట్‌గా ఉండాలి’’ అని పేర్కొన్నారు. మరి, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వైఎస్ జగన్, ముఖేష్ అంబానీల అపూర్వ కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.