ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల వ్యవహారం రోజురోజుకి ముదురుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు మాములుగా సాగిన ఈ రచ్చ ఆర్జీవీ రంగప్రవేశంతో కొత్త టర్న్ తీసుకుంది. టికెట్స్ రేట్ల విషయంలో వర్మకి పేర్ని నానికి మధ్య మాటల యుద్ధమే సాగింది. సరిగ్గా ఇదే సమయంలో కొడాలి నాని మాటలపై స్పందించడానికి ఆర్జీవీ ఇష్టపడలేదు. తనకి హీరో నాని మాత్రమే అని.. కొడాలి నాని తెలియదంటూ వర్మ సెటైరిక్ గా సమాధానం ఇచ్చారు. తాజాగా ఈ కామెంట్స్ పై కొడాలి నాని స్పందించారు. “రామ్ గోపాల్ వర్మకు కొడాలి నాని తెలియకపోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది. అసలు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారని చాలా మందికి తెలిసొస్తోంది. త్వరలోనే మీకు కొడాలి నాని కూడా తెలుస్తాడు అంటూ” మంత్రి నాని స్పందించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.