సీఎం జగన్ ని సైతం తన మాటలతో ఏడిపించిందో అమ్మాయి. ఆ అమ్మాయి నేపథ్యం గురించి చెబుతూ అందరినీ ఏడిపించేసింది.
ఏపీ సీఎం జగన్ పథకాల వల్ల లబ్ధి పొందినట్టు ఇప్పటికే చాలా మంది చెప్పుకొచ్చారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వంటి పథకాల ద్వారా ఓటు హక్కు లేని విద్యార్థులు కూడా లబ్ధి పొందుతున్నారు. స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ విద్యార్థుల వరకూ ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నారు జగన్. తాజాగా ఓ అమ్మాయి కూడా జగన్ పథకాల వల్ల లబ్ది పొందింది. ఆ అమ్మాయిది ఒక మారుమూల గ్రామం. ఆ అమ్మాయి పేదరికంలో పుట్టింది. తండ్రిది ఆకు కూరల వ్యాపారం. అమ్మకు మాటలు రావు, వినిపించవు. ఉన్నట్టుండి తండ్రికి పక్షవాతం వచ్చింది. ఆ అమ్మాయి అప్పుడే ఇంటర్ పూర్తి చేసింది. ఇక పై చదువు చదవలేనేమో అని భయపడిపోయింది. తనకి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులకు అండగా నిలబడలేనేమో అని బాధపడింది.
ఆ సమయంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తన తల్లిదండ్రులిద్దరికీ పెన్షన్ వచ్చేలా చేసి.. ఆ అమ్మాయికి వసతి దీవెన, విద్యా దీవెన పథకం కింద ఉన్నత చదువు అందేలా చేశారు జగన్. కట్ చేస్తే ఆ అమ్మాయి ఇప్పుడు డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతుంది. తన నేపథ్యం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యింది. హోమ్ మంత్రి తానేటి వనిత క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన సభకు సీఎం జగన్ హాజరయ్యారు. విద్యాదీవెన పథకం కింద 9 లక్షల 95 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 703 కోట్ల రూపాయల నిధులను జమ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. దివ్య అనే యువతి కూడా స్టేజ్ ఎక్కి తన సంతోషాన్ని తెలియజేసింది.
తన స్పీచ్ ప్రారంభంలోనే అందరిలో జోష్ నింపిన ఆ అమ్మాయి.. ఉన్నట్టుండి ఒక్కసారిగా అందరినీ ఏడిపించేసింది. తన నేపథ్యం గురించి చెబుతూ సీఎం జగన్ ని సైతం కంటతడి పెట్టించింది. తన తల్లిదండ్రులిద్దరూ వికలాంగులని, తండ్రి ఒక అవిటి వాడు అని, తల్లి చెవిటి, మూగ అని, ఇంట్లో ఇద్దరం ఆడ పిల్లలం ఉన్నామని అంటూ కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రి ఆకుకూరలు అమ్మేవాడని, అనుకోకుండా నాన్నకు పక్షవాతం వచ్చిందని.. అయితే తన తల్లిదండ్రులకు జగన్ పెన్షన్ ఇచ్చి కుటుంబాన్ని ఆదుకున్నారని, కృతజ్ఞతలు తెలియజేసింది. తాను ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం జగన్ అన్న అని వెల్లడించింది. వసతి దీవెన, విద్యా దీవెన కింద తాను ఇప్పుడు చదువుకోగలుగుతున్నానని వెల్లడించింది. ఈ అమ్మాయి మాటలకు సీఎం జగన్ కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్స్ ఈ అమ్మాయి స్పీచ్ కి సెల్యూట్ చేస్తున్నారు.