సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా నేను చచ్చిపోయినట్లు నాకు అనిపిస్తోంది అంటూ సెటైర్ వేశారు. ఇంతకీ ఆయనకు అంతలా అనాల్సిన పరిస్థితి ఏంటీ అన్న విషయం గురించి తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మకు ఓ కుటుంబంలోని వారందరూ అభిమానులే. ఆయన పేరిట హోటల్ పెట్టేసి, దాని నిండా ఆర్జీవీ సూక్తుల పోస్టర్లను కూడా ముద్రించి కస్టమర్లతో చదివిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆర్జీవీ వీరాభిమాని వెంకటరమణ తన అభిమాన డైరెక్టర్ పేరుతో ఓ హోటల్ పెట్టి స్థానికంగా ఫేమస్ అయ్యాడు. ఈ యువకుని తల్లి, సోదరుడు కూడా ఆర్జీవీ వీరాభిమానులే. జిల్లాలో ఓడలరేవు వైపుగా ఎవరైనా కొత్తవారు వెళ్తుంటే బెండమూర్లంక సెంటర్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ రామ్‌గోపాల్‌వర్మ ఫొటోతో కనిపించే హోటల్ చూసి తప్పకుండా ఆ హూటల్ కి రావాల్సిందే.. అక్కడ ఆయన ఫోటోలు చూసి షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఆ హూటల్ లో ఎక్కడ చూసినా రామ్‌గోపాల్‌వర్మ ఫొటోలు, పోస్టర్లు, రామ్‌గోపాల్ వర్మ పలు సందర్భాల్లో పలు వేదికలపై మాట్లాడిన సంచలన డైలాగులు దర్శనమిస్తాయి.
ఇది కూడా చదవండి : భార్య మరణించిన గంటలోపే భర్త మృతి! వీరి ప్రేమకి సెల్యూట్!
ఇక ఆ హూటల్ కి వచ్చే కస్టమర్లు ఆర్జీవీ చెప్పిన మాటలు దైవ వాక్కుల్లా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఈ విషయం కాస్తా ఆ నోటా.. ఈ నోటా వర్మ చెవిలో పడినట్టున్నాయి. తాజాగా ఆ హోటల్‌కు సంబంధించిన ఓ వీడియోను ఆర్జీవీ స్వయంగా పోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘నా పేరుతో హోటల్ ఉంది. నేను చచ్చిపోయినట్లు నాకు అనిపిస్తోంది’ ట్విట్టర్ లో తనదైన స్టైల్లో సెటైర్ వేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A hotel on my name | I feel DEAD 😳😳😳 https://t.co/hxvKp4uKaU via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) December 25, 2021
