‘‘జినోమ్ వ్యాలీ పెట్టాం.. ఎప్పుడు పెట్టాం 2000లలో పెట్టాం.. కరోనా వస్తుందని నాకు తెలుసా?.. 2000 సంవత్సరంలో పెట్టి.. భవిష్యత్తు బయోటెక్నాలజీదేనని ఆ రోజే నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఇండియాలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ఘటన, కరోనా వ్యాక్సిన్ తయారు చేయటానికి దోహద పడిన పార్టీ తెలుగు దేశం పార్టీ అవునా? కాదా? ఆ కరోనా వ్యాక్సిన్ రాకపోయి ఉంటే తమ్ముళ్లు.. ఇంకా ఎంత మంది చనిపోయే వారో మనవాళ్లు. ఇప్పుడు చైనా మళ్లా వస్తుందంటున్నారు. వేరే దేశాల్లో వస్తుందంటున్నారు. కానీ, మన దగ్గర వచ్చినా.. మన వ్యాక్సిన్ మంచిగా పని చేస్తా ఉంది. మళ్లీ వ్యాక్సిన్ గానీ, వేయించుకుంటే ప్రాణ నష్టాన్ని తగ్గించే శక్తి భారత దేశానికి ఉంటుందని మీకు తెలియజేస్తున్నా’’ బుధవారం ఖమ్మంలో జరిగిన శంఖారావం సభలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రోలింగ్స్‌కు గురవుతున్నాయి. భారత్‌లో వ్యాక్సిన్ తయారు చేసింది టీడీపీనేనని ఆయన అనటం ట్రోలింగ్స్‌కు తావిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు దీన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే, చంద్రబాబు అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఒకరకంగా భారత్‌లో వ్యాక్సిన్ తయారవటానికి చంద్రబాబు కూడా కారణం. ఎందుకంటే.. ఇండియాలో మొదటి వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారత్ బయోటెక్ ఇంటర్‌నేషనల్ నెలకొల్పబడిన ‘‘జినోమ్ వ్యాలీ’’ని స్థాపించింది చంద్రబాబు నాయుడే. 1999 నవంబర్ 22న ఈ జినోమ్ వ్యాలీని బాబు ఎస్టాబ్లిష్ చేశారు.
ఇందులో భారత్ బయోటెక్ ఇంటర్‌నేషనల్‌తో పాటు పలు కంపెనీలు భాగస్వామ్యం అయ్యాయి. ఈ జినోమ్ వ్యాలీ అనేది హై టెక్నాలజీ బిజినెస్ డిస్ట్రిక్ట్. హైదరాబాద్‌లో దాదాపు 2000 వేల ఎకరాల్లో ఏర్పాటు చేయబడింది. ఈ జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ ఇంటర్‌నేషనల్ కరోనా సమయంలో కోవ్యాక్సిన్‌ను తయారు చేసింది. అందుకే ఇండియాలో కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసింది టీడీపీ అని చంద్రబాబు చెప్పుకున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా ఇండియాలో కరోనా వ్యాక్సిన్ తయారు అవ్వటానికి కారణం చంద్రబాబు నాయుడే. దీన్ని పనిగట్టుకుని మరీ ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. మరి, చంద్రబాబు వ్యాఖ్యలపై వస్తున్న ట్రోలింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.