ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురువారం మర్యదాపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురువారం మర్యదాపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లికి వెళ్లిన చాగంటి, సీఎం జగన్ తో మర్యదా పూర్వకంగా భేటీ అయ్యారు. అయితే ఇటీవలే చాగంటికి టీటీడీలో కీలక పదవి అప్పగించిన సంగతి మనకు తెలిసిందే. కొన్ని రోజుల క్రితం చాగంటి కోటేశ్వరరావును TTD ధార్మిక సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే వీళ్ల భేటీ మర్యదపూర్వకంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావును సీఎం జగన్ సత్కరించారు. చాగంటికి బహుమతిగా శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు ముఖ్యమంత్రి జగన్.
ఈ కార్యక్రమంలో చాగంటితో పాటు శాంతా బయోటిక్నిక్స్ లిమిటెడ్ ఫౌండర్, డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ తో భేటీ అనంతరం.. సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించారు చాగంటి కోటేశ్వరరావు, వరప్రసాద రెడ్డి. అక్కడి పరిసరాలను చూసిన చాగంటి, జగన్ పై ప్రశంసలు కురిపించాడు. గోశాలను తీర్చిదిద్దిన తీరు అద్భుతం అని కొనియాడాడు. ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని భేటీ అనంతరం చెప్పారు చాగంటి. మరి చాగంటి, జగన్ భేటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.