Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో భద్రతా వైపల్యం వెలుగుచూసింది. మోదీ హెలికాప్లర్ వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో నల్ల బెలూన్లు దర్శనమిచ్చాయి. ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టునుంచి భీమవరం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఎయిర్ పోర్టుకు 2 కిలో మీటర్ల దూరంలో డజన్ల కొద్దీ బెలూన్లను ఎగురు వేశారు. కేసరి పల్లి గ్రామంలో ఈ బెలూన్లు గాల్లోకి లేచినట్లు తెలుస్తోంది.
ఆ మార్గంలో వెళుతున్న మోదీ హెలికాప్టర్ పక్కనే ఆ నల్ల బెలూన్లు ఎగరసాగాయి. అంతకు క్రితం ప్రధాని పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఇక, పోలీసులు నల్ల బెలూన్ల ఘటనపై సీరియస్ అయ్యారు. ఆ బెలూన్లు ఎవరు ఎగురవేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. కాగా, సోమవారం భీమవరంలో జరుగుతున్న స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. అనంతరం ఓ బహిరంగ సభలో ప్రజలను ఉద్ధేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. మరి, మోదీ హెలికాప్లర్ వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో నల్ల బెలూన్లు దర్శనమవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan: దటీజ్ పవన్.. ఫోటో వైరల్.. ఎక్కడ తగ్గాలో ఆయనకు బాగా తెలుసు!