ఏపీ రాజకీయాల్లో ఆడియో లీకులు పెద్ద దుమారమే రేపుతున్నాయి. వైకాపా నాయకుడు అంబటి రాంబాబు పేరిట ఆడియో లీకైన విషయం తెలిసిందే. ఆడియో తనది కాదంటూ అంబటి రాంబాంబు వివరణ ఇస్తూ ఓ విడియో కూడా రిలీజ్ చేశారు. బాధ్యులపై న్యాయపరంగా చర్యలుంటాయని చెప్పారు. తాజాగా మరో వైకాపా నాయకుడి పేరిట రిలీజయిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైకాపా ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఆడియోగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆడియోలో ఓ వ్యక్తి, మహిళ సంభాషణలు ఉన్నాయి. వ్యక్తి ఇంటికి రా… నా కోసం రాలేవా అంటూ మాట్లాడుతున్నాడు. మహిళ రాలేను సార్, కుదరదని చెప్పాను కదా అంటుంది. ఎవరైనా గుర్రాన్ని నీళ్ల దాకా తీసుకెళ్లగలం కానీ, నీళ్లు తాగించలేము కదా అంటాడు. మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుంది. రా, చెప్పిన మాట విను. వెంటనే అరగంటలో పంపేస్తాను. అరగంట కూడా సమయం కేటాయించలేవా అని అడగగా.. మహిళ లేదు సార్, రాలేను అంటుంది.