SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Alluri Sitarama Raju Tribal Villagers Built Stone Bridge

గర్భిణి నరకయాతన చూసి కదిలిన గ్రామస్థులు.. రాత్రికి రాత్రే రాతి వారధి!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Mon - 5 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాత్రికి రాత్రే రాతికట్టు వారధి నిర్మించిన గ్రామస్థులు..ఎందుకో తెలుసా

ప్రభుత్వాలు మారతాయి, హామీలు వస్తాయి… కానీ ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల తలరాతలు మాత్రం మారవు అనడానికి ఇదే నిదర్శనం.వారికి ఏ చిన్న కష్టమొచ్చిన ఆస్పత్రికి వెళ్లాలంటే వాగు దాటుతూ వెళ్తూ పెద్ద సాహసం చేయాల్సిందే.. తాజాగా ఓ గర్భిణి పడిన నరకయాతన చూసి ఆ గ్రామస్తుత గుండెలు మండిపోయాయి. అధికారుల చుట్టూ తిరగడం దండగ అనుకుని, ఇంటింటికీ రెండేసి వందలు వేసుకొని, ఆ రాత్రికి రాత్రే వాగుపై రాతి వారధిని నిర్మించి చరిత్ర సృష్టించారు. ఈ స్పూర్తి గాధ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా లో జరిగింది..

Advertisement

అల్లూరి సీతారామరాజు జిల్లా… ప్రకృతి అందాలకు నిలయమే కాదు, గిరిజనుల నిత్య పోరాటాలకు ప్రతీక. ఈ జిల్లాలోని గూడెంకొత్తవీధి మండలం, ధారకొండ పంచాయతీ పరిధిలో మూడు మారుమూల గ్రామాలున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ ప్రాంత ప్రజలకు రోడ్డు సౌకర్యం అనేది కేవలం ఒక కల మాత్రమే. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, ప్రసవ వేదనతో ఏ మహిళ బాధపడినా ఆసుపత్రికి చేర్చాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. కొండలు, వాగులు దాటుకుంటూ కిలోమీటర్ల కొద్దీ నడవడమే అక్కడి ప్రజల దినచర్య. అక్కడ జరిగిన ఒక హృదయ విదారక ఘటనే ఆ గ్రామస్థుల ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చేసింది. ఇటీవల కాలంలో తడకపల్లి గ్రామానికి చెందిన ఒక గర్భిణి తీవ్రమైన ప్రసవ నొప్పులతో అల్లాడిపోయింది. సరైన రోడ్డు లేకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ వచ్చే మార్గమే లేకపోయింది. చేసేది లేక గ్రామస్థులు ఆమెను డోలీలో మోసుకుంటూ ఏకంగా ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచి ఆసుపత్రికి చేర్చాల్సి వచ్చింది. ఆ మార్గమధ్యంలో ఆ గర్భిణి పడ్డ నరకయాతన, ఆమె కుటుంబ సభ్యులు పడిన వేదన ఆ ఊరి ప్రజల గుండెలను పిండేసింది. “ఇంకెంతకాలం ఈ చావు బతుకులు? ప్రభుత్వాలు మారినా మన గతి మారదా?” అనే ప్రశ్న అందరిలోనూ ఆగ్రహాన్నిగురిచేసింది..

ఎవరికోసమో ఎదురుచూడటం కంటే, మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలని ఆ మూడు గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు. వెంటనే అందరూ ఒక తాటిపైకి వచ్చి అద్భుతమైన ఐక్యతను ప్రదర్శించారు. ఇంటింటికీ రూ. 200 చొప్పున విరాళాలు పోగుచేశారు. ఆ వచ్చిన డబ్బులతో కూలీ సామాగ్రిని సమకూర్చుకున్నారు. ఆ తర్వాత ఊరి యువకులు, పెద్దలు అంతా కలిసి రంగంలోకి దిగారు. పట్టుదల ఉంటే కొండనైనా పిండి చేయవచ్చన్నట్లుగా… శ్రమదానంతో రాత్రికి రాత్రే వాగుపై రాతి కట్టడాలతో ఒక తాత్కాలిక వారధిని నిర్మించారు. ఆ ప్రజల కఠిన శ్రమ ఫలితంగా ఇప్పుడు ఆ వాగుపై చిన్నపాటి వంతెన సిద్ధమైంది. దీనితో ఇప్పుడు ఆ గ్రామాల ప్రజల రాకపోకలు సులభమయ్యాయి. టూవీలర్లు, జీపులు, ట్రాక్టర్లు ఆ రాతి వారధిపై నుంచి సునాయాసంగా రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి, అత్యవసర వేళల్లో ఆసుపత్రికి వెళ్లడానికి రవాణా సౌకర్యం ఏర్పడింది. తమ కష్టాలను తామే తీర్చుకున్న ఆ గిరిజనుల సంకల్పం అందరిచేత శభాష్ అనిపిస్తోంది.
అయితే, గ్రామస్థులు చెబుతున్న మాట మరొకటి ఉంది. తాము కట్టుకున్నది తాత్కాలిక వంతెన మాత్రమేనని, వర్షాకాలంలో వాగు ఉప్పొంగితే ఇది కొట్టుకుపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన చోట ఒక పక్కా వంతెనను , అలాగే మంచి రోడ్డును నిర్మించి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు

Tags :

  • Andhra Pradesh tribal news
  • tribal village bridge
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ‘రియాలిటీ’ పక్కా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్.. స్టార్ కాస్టింగ్‌తో దుమ్మురేపనున్న సినిమా!

  • లండన్ ఉద్యోగం అంటూ పెళ్లి.. రూ.40 లక్షలు, బంగారం తీసుకుని భార్యకు మోసం? న్యాయం కోసం బాధితురాలి ధర్నా

  • గర్భిణి నరకయాతన చూసి కదిలిన గ్రామస్థులు.. రాత్రికి రాత్రే రాతి వారధి!

  • రెండో అంతస్తు నుంచి పడిన బాలుడు.. గాల్లోనే పట్టుకుని కాపాడిన యువకుడు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్? ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్

  • బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam