వైజాగ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ఫ్లాంట్ లోని స్టీల్ మెల్లింగ్ షాప్-2లో జరిగిన ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో వరుస ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. శనివారమే మూడు ఘటనలు సంభవించాయి. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం, శ్రీశైలం అన్నదాన భవనంలో అగ్ని ప్రమాదాల జరిగాయి. ఇప్పుడు తాజాగా వైజాగ్ లో మరో ఘటన చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రమాదం జరిగింది. స్టీల్ మెల్లింగ్ షాప్-2లో ప్రమాదం జరగ్గా.. ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. లిక్విడ్ స్టీల్ వీరిపై చిమ్మడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ లిక్విడ్ ను లాడిల్ అనే పరికరం ద్వారా ట్యాంకర్ ను నింపే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఓ లాడిల్ కి రంధ్రం పడి కింద పడి ఉంటుందని సమాచారం.
అధిక ఉష్ణోగ్రతలతో మరిగే స్టీల్ లిక్విడ్ కింద పడిపోవడంతో అది పేలి ద్రావకం వారిపై పడిందని తెలుస్తోంది. దీంతో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాళ్లు, చేతులపై ఈ లిక్విడ్ పడింది. కాలిన గాయాలతో వారంతా విలవిలలాడుతున్న దృశ్యాలు మీడియా చాన్నళ్లలో కనిపిస్తున్నాయి. వీరిలో ఇద్దరు స్టీల్ ఫ్లాంట్ కార్మికులు కాగా, మరొకరు నలుగురు ఒప్పంద కార్మికులుగా అధికారులు చెబుతున్నారు. వీరిని ముందుగా స్టీల్ ఫ్లాంట్ జనరల్ ఆసుప్రతి నుండి మెరుగైన చికిత్స కోసం వీరిని ప్రైవేటు ఆసుప్రతులకు తరలించారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
