ఎంపీ గోరంట్ల మాధవ్ గా చెప్పుకుంటున్న వీడియో కాల్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ వీడియో తనది కాదని.. తన జిమ్ వీడియో మార్ఫింగ్ చేశారని గోరంట్ల ఖండించిన విషయం తెలిసిందే. కొందరిపై ఫిర్యాదు కూడా చేశానన్నారు. ఇదే అంశంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే మాత్రం పార్టీ తరఫున కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇప్పుడు ఈ వీడియో కాల్ వ్యవహారంపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ స్పందించాడు. ఓ ఛానల్ చర్చలో పాల్గొన్న పృథ్వీ- గోరంట్ల మాధవ్ పై వస్తున్న ఆరోపణల విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన విషయంలో ఎలా అయితే వెంటనే చర్యలు తీసుకున్నారో అలాగే గోరంట్ల మాధవ్ విషయంలోనూ చర్యలు ఉండాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.