అమెరికాలో లక్షల్లో జీతం కాదని గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి సొంతింటి కలను నిజం చేయడం కోసం స్టార్టప్ కంపెనీని ప్రారంభించి తక్కువ ధరకే ఇండ్లను నిర్మిస్తున్నారు ఓ మహిళ. అది కూడా వ్యవసాయ వ్యర్థాలతో ఎకో ఫ్రెండ్లీ హౌస్ లను నిర్మిస్తున్నారు.
Sneha Sirivara: ఆలోచన చిన్నదే కావచ్చు.. ఆ ఆలోచనకు ఓ జీవితాన్నే మార్చే శక్తి ఉంటుంది. అందరిలా కాకుండా.. భిన్నంగా ఓ మంచి ఆలోచన చేస్తే.. ఆ ఆలోచన పది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఇందుకు స్నేహ సిరివర జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. జీతం కోసం ఉద్యోగంలోనే ఉండిపోయి ఉంటే స్నేహ సిరివర గురించి మనం ఇప్పుడు చర్చించుకునేవాళ్లం కాదు. అలా అందరిలా కాకుండా.. జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకుని జీవితం వైపు అడుగులు వేసింది. […]