కేంద్రంలో ప్రధాని మోదీ పేద కుటుంబాల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. విద్యా, ఆరోగ్యం, ఆర్థిక సాయం చేకూరే విధంగా అనేక సౌకర్యవంతమైన స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ రోజుల్లో మార్కెట్లో ప్రతి పదార్థం కల్తీ అవుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కల్తీ దందా కొనసాగుతూ.. మనుషుల ప్రాణాలను హరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా WHO హెచ్చరికలు జారీ చేసింది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో ప్రాణాంతక వైరస్. మార్‌బర్గ్ వైరస్ గా పిలవబడుతున్న ఈ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్ర జ్వరం బారిన పడి రక్తనాళాలు చిట్లి మరణించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది. అందులోనూ.. ఈ వైరస్ సోకిన 8 నుంచి 9 రోజుల్లోనే మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీకి చెందిన రెండు దగ్గు మందులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని.. ఉజ్బెకిస్తాన్ లోని చిన్నారులకు వాడొద్దని ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఉజ్బెకిస్తాన్ లో మరియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి 18 మంది చిన్నారులు ప్రాణాలు కొల్పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నారుల మరణం తర్వాత […]
భారత ఫార్మా కంపెనీ ‘మైడెన్ ఫార్మా‘ తయారు చేసిన దగ్గు సిరప్ ల కారణంగా ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేస్తూ వైద్య ఉత్పత్తుల హెచ్చరికను జారీ చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన సిరప్ లలో మోతాదుకు మించి డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ ఉపయోగించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని వెల్లడించింది. ఈ ప్రకటన వెలుబడిన వెంటనే […]
పిల్లలకు జలుబు, దగ్గు చేసిందని పెద్ద కంపెనీ మెడిసిన్ అని తీసుకొచ్చి వేసిన తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. ఆ మందు ఏకంగా 66 మంది పసిపిల్లలను బలి తీసుకుంది. అది కూడా భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన మందుతోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశాల్లో గాంబియాలో 66 మంది పిల్లలు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి చెందిన దగ్గు, జలుబు మందులు తాగి మరణించారు. దీంతో ఈ కంపెనీకి చెందిన నాలుగు రకాల మందులను […]
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయిన కొందరు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరొకవైపు హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనం నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కొందరు పోలీసులకు భయపడి, జరిమానల నుంచి తప్పించుకునేందుకు నామమాత్రంగా హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే కొన్ని హెల్మెట్లు తల మొత్తాన్ని కవర్ చేయవు. అలాంటి హెల్మెంట్ ధరించి.. వాహనం నడిపే వ్యక్తులు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ […]
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ డెల్టా కంటే ఆరు రెట్ల వేగంతో వ్యాప్తిచెందుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇప్పటికే ఈ వేరియంట్ 77కిపైగా దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ తో మరణాలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఆసుపత్రుల్లో రోగుల వివరాలు అందించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు వైరస్ కట్టడికి తగు చర్యలు చేపట్టాలని సూచించింది. ‘ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 77 దేశాలకు విస్తరించింది. ఇది అత్యంత వేగంగా చాలా దేశాలకు విస్తరించే […]
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓమిక్రాన్ వేరియెంట్ రోజురోజుకి విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీ సంకేలో ఓమిక్రాన్ కేసులు నమోదు అవడంతో భారత్ తో సహా మిగతా దేశాలన్నీ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. కొన్ని కఠినమైన ఆంక్షలతో దేశంలో కరోనా టెస్టులు కట్టుదిట్టం చేసాయి. ఇండియాలో ప్రస్తుతం 25కి పైగా కేసులు బయటపడటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటువంటి క్లిష్టమైన తరుణంలో ఓమిక్రాన్ వేరియెంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organisation) గుడ్ న్యూస్ తెలిపింది. […]
మానవ జీవితాన్ని కబళించివేసింది కరోనా. సమాన్య పౌరుడు కరోనా పేరువిన్నా గడగడలాడిపోయాడు. లాక్ డౌన్ లో పడిన కష్టాలు వర్ణనాతీతం. ఏ కాస్త అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ ఆ చీకటి రోజులు వస్తాయంటున్నారు నిపుణులు. కరోనా పోయి సాధారణ జీవితం మొదలవుతోందని ఆనందపడే లోపే మరో ప్రళయం ముంచుకొస్తోందని సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి ఒమిక్రాన్ లా మళ్లీ దూసుకొస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే 30 దేశాలకుపైనే చుట్టేసింది. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటం భయాందోళనకు […]