అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మేము ఎందులోనూ తక్కువ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వీధి రౌడీల్లా రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. తాజాగా ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని.. బట్టలు చింపుకుంటూ కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
ఇటీవల కాలంలో యువత బైక్ పై చిత్ర, విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఫేమస్ అయ్యేందుకు పిచ్చి ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. నడిరోడ్డుపై . లవర్స్‌తో చేసే చిత్ర, విచిత్ర విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుతోంది. అయితే తామేమీ తక్కువ తినలేదని నిరూపించారు ఇద్దరు అమ్మాయిలు.