ఇటీవల కాలంలో మహిళా లిరిసిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు శ్రేష్ట. ఓ రొమాంటిక్ క్రైమ్ కథతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన ఆమె.. అనతికాలంలోనే మంచి గేయరచయితగా పేరు గడించింది. గతంలో సినిమా పరిశ్రమపై తీవ్ర అరోపణలు చేసిన ఆమె.. ఇప్పుడు ఓ పోస్టుతో కలకలమే రేపింది.
అనంత శ్రీరామ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అనతి కాలంలోనే సినీ గేయ రచయితగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారాయన. స్టార్ హీరోల సినిమాల్లో అనంత శ్రీరామ్ రాసిన పలు సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఆయన పాపులర్ లిరిక్ రైటర్‌గా మారారు. అలాంటి అనంత శ్రీరామ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై భట్రాజు కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంత శ్రీరామ్ మీద అనంతపురం […]
తెలుగు చిత్రపరిశ్రమలో గేయ రచయితగా మంచి గుర్తింపు పొందినవారిలో అనంత శ్రీరామ్ ఒకరు. ఆయన చూడటానికి ఎంత సౌమ్యంగా కనిపిస్తాడో.. ఆయన రాసే పాటలు కూడా అంతే సౌమ్యంగా ఉంటాయి. అయితే.. ఎల్లప్పుడూ సాఫ్ట్ గా కనిపిస్తూ.. చక్కగా మాటలతో మెప్పించే అనంత శ్రీరామ్.. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మరి అంతలా ఆశ్చర్యపోవడానికి అనంత శ్రీరామ్ ఏం చేశాడో తెలుసా! మనకు తెలిసినట్లుగా పాట పాడటమో, ప్రాసతో కూడిన మాటలు […]
సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల వరుస మరణాలు అభిమానులను కలచివేస్తున్నాయి. ఒకరి మరణం గురించి మర్చిపోయేలోపే మరొకరు వార్తల్లో నిలవడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి.. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ ఇటీవల కన్నుమూశారు. తెలుగు సినిమా పాటలతో పాటు తెలంగాణకు సంబంధించి ఎన్నో మరుపురాని పాటలు రాశారు రచయిత కందికొండ యాదగిరి. ఇండస్ట్రీలో కందికొండగా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలంగా గొంతు క్యాన్సర్ […]
జేకే భారవి.. భక్తి చిత్రాల రచయితగా తెలుగు ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణం పోశారు. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో విజవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. అప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న ఆయన జీవితం.. ఒక్క సినిమా దెబ్బకు పూర్తిగా మారిపోయింది. ఆర్థికంగా కోలుకోలేని స్థితికి వచ్చేశారు. లగ్జరీ కార్లలో తిరగాల్సిన వ్యక్తి.. ప్రస్తుతం ఓలా […]
సినీ పరిశ్రమ మళ్లీ కన్నీరుపెట్టింది. రెండు రోజుల క్రితం మాస్టర్ శివశంకర్ మరణగాయం మాయకముందే మరో సినీ ప్రముఖుడు కన్నుమూశారు. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) మృతిచెందారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంతో ఆయన ఇంటి […]
గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కి కరోనా సోకి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఈ మద్య సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతలకు లోనయ్యారు. వెంటనే ఆయన్ని కిమ్స్ ఆస్పత్రి చేర్పించారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. శ్వాస […]