రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వేళ వైఎస్సార్ కడప జిల్లాలో పొలిటికల్ సెగలు రేగుతున్నాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పరిస్థితి ఒక్కసారిగా రణరంగాన్ని తలపిస్తోంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటుచేసుకున్న బాహాబాహీ దాడులు, రాళ్ల వర్షంతో పులివెందుల అట్టుడుకుతోంది. ఆర్.తుమ్మలపల్లిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర హింసాత్మకంగా మారింది. మరోవైపు లింగాల మండలం పార్నపల్లెలో పోలింగ్ ప్రారంభం కాకముందే ఉద్రిక్తత పీక్స్‌కు చేరింది. అక్కడకు దూసుకొస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో […]