రక్షణ కల్పించాల్సిన పోలీస్‌నే వివాదంలో చిక్కుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ బర్త్‌డే వేడుకలకు హాజరైన కాంగ్రెస్ నాయకులపై బెదిరింపులకు దిగుతూ దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వేడుకల్లో మొదలైన వివాదం చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లిలోని ఓ రిసార్ట్‌లో బర్త్‌డే వేడుకలు జరుగుతున్నాయి. […]
సోషల్ మీడియా మోజు, చిన్నపాటి ఆవేశం.. ఒక నిండు కుటుంబాన్ని తీవ్ర ఆవేదనలోకి నెట్టేసింది. గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రీల్స్ చేయడంపై భర్త మందలించాడనే చిన్న కారణంతో, మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని నాగులగారి తేజగా గుర్తించారు. తేజ స్వస్థలం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామం. ఆమెకు గజ్వేల్‌కు చెందిన గోపాలరెడ్డితో వివాహమైంది. ప్రస్తుతం వీరు గజ్వేల్ […]