ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(పీఎం-జేఏవై)’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అర్హులైన లబ్దిదారులు అనారోగ్యం బారిన పడినప్పుడు.. ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అయినా ఉచితంగా నాణ్యమైన ఆరోగ్యసేవలు పొందవచ్చు. ఇప్పటివరకు ఈ పథకం కింద పది […]