తెలంగాణ రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏకగ్రీవం అయిన స్థానాలు మినహా.. ఇవాళ నల్గొండ, ఖమ్మం, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది.. ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం 4 గంటలకు జరిగిన పోలింగ్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. […]