కరోనా కష్ట కాలంలో మానవత్వం మంట కలుస్తోంది. ఎవరు ఎలా పోయినా పర్లేదు, మనం బాగుంటే చాలు అనే భావనలో కొంతమంది బతికేస్తున్నారు. వనపర్తి జిల్లా మదనాపురంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఇదే గ్రామానికి చెందిన శకుంతలమ్మ గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తూ వస్తోంది. ఆమె వయసు 80 సంవత్సరాలు. అరాకొర దూరపు బంధువులు తప్ప.., ఆమెకి సొంత మనుషులు ఎవ్వరూ లేరు. దీంతో.., ఇరుగుపొరుగునే తన వాళ్ళగా భావించి అందరితో బాగుంటూ జీవిస్తూ వచ్చింది […]