ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఎప్పుడూ ఆకర్షించే థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ దీవిలో ఒక పెను విషాదం చోటుచేసుకుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్న తెల్లవారుజాము సమయంలో, ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది సజీవదహనమయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. థాయ్‌లాండ్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్‌లోని పటాంగ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 3 […]