వన్డేలు బోర్ కొడుతున్నాయని తెలిపారు.. మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. అందువల్ల ఈ ఫార్మాట్‌లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. టెస్టుల్లానే వన్డేలను నాలుగు భాగాలూ చేయాలని, ఒక్కో జట్టును 25 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్‌లు ఆడించాలని తెలిపాడు.. కాకుంటే.. ఇందులో ఓ ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి.
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వర్క్‌లోడ్ ప్రెజర్‌తో వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వన్డే క్రికెట్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. వన్డే క్రికెట్‌కు భవిష్యత్తు లేదని, టీ20 ఫార్మాటే ప్రపంచ క్రికెట్‌ను ఏలబోతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం ఉన్న మూడు ఫార్మాట్ల(టెస్ట్, వన్డే, టీ20) మనుగడపై స్పందించాడు. ‘క్రికెట్ ఆడటం ముఖ్యమని.. అది ఏ ఫార్మాట్ అయినా సరే. టెస్టు, […]