ఆకాశం నుంచి ఉన్నట్టుండి ఒక వస్తువు జారి పడింది. అతి పెద్ద వెలుగుతో అది భూమ్మీదకు చేరుకుంది. ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
4జీ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు 5జీ ట్రెండ్ నడుస్తోంది. అయితే 4జీ నెట్ వర్క్ ను చంద్రుడిపై కూడా ప్రారంభించాలని చూస్తున్నారు. అక్కడెవరూ లేరు కద సార్ అని మనకి అనిపించవచ్చు. కానీ చంద్రుడి మీద సెల్ టవర్లు పెట్టాలనుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.
గత కొంతకాలంగా ప్రపంచలోని అత్యున్నత పదవులను అలంకరిస్తున్నారు భారత సంతతికి చెందిన వ్యక్తులు. ఈ జాబితాలోకి మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చేరాడు. అతడి పేరు అమిత్ క్షత్రియ. త్వరలో చేపట్టబోయే 'మూన్ టు మార్స్' ప్రయోగానికి సారథిగా నియమించింది నాసా. ఇక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.
ఈ విశ్వంలో అద్భుతాలకు కొదవే లేదు. ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం చోటుచేసుకోబోతోంది. మీకు తోక చుక్కలు తెలుసా? సాధారణంగా నక్షత్రాల మాదిరిగానే కనిపిస్తాయి. కాకపోతే కాస్త ఎక్కువ వెలుతురు, వేగంగా ప్రయాణిస్తూ ఉండటం చూసుంటారు. అయితే ఇప్పుడు ఆకాశంలో ఓ ఆకుపచ్చ తోకచుక్క దర్శనమివ్వనుంది. దీనిని గ్రీన్ కామెట్ అని పిలుస్తారు. ఈ తోకచుక్క భూమికి బాగా చేరువగా రాబోతోంది. అదికూడా రాతియుగం తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలా జరగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తోకచుక్క అంటే […]
ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చంద్రుడి మీదకు మనుషులు వెళ్లి వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఇక వెళ్ళింది లేదు. చివరిసారిగా చంద్రుడి మీదకు వెళ్ళింది 1972 డిసెంబర్ లోనే. అపోలో 17 మిషన్ లో భాగంగా చంద్రుడి మీద అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇక ఏ దేశం కూడా వెళ్లే ప్రయత్నం చేయలేదు. అయితే చంద్రుడి మీద మనుషులు నివసించడం సాధ్యమే అని ఆ మధ్య ప్రచారం కూడా చేశారు. కానీ ఆ ప్రచారం కూడా […]
చంద్రుడి మీదకు మనుషులను పంపడానికి నాసా శ్రీకారం చుట్టిన ఆర్టిమిస్-1 ప్రయోగం వాయిదాపడింది. స్పేస్ లాంచ్ సిస్టమ్, ఇంజిన్- R25లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది నాసా. ఇంజిన్‌ను ప్రయోగించే ముందు కండిషన్ చేయడానికి లిక్విడ్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌తో బ్లీడ్ చేయవలసి ఉంటుంది. అయితే.. ఒకదానిలో ఆ విధంగా జరగట్లేదని నాసా ఇంజనీర్లు గుర్తించారు. వెంటనే.. అప్రమత్తమైన నాసా.. కౌంట్‌డౌన్ క్లాక్‌ను టీ-40 నిమిషాల వద్ద నిలిపేసి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. చంద్రుడిపైకి […]
చైనా ఇటీవల స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం కావాల్సిన ల్యాబరేటరీ మాడ్యూల్ ని.. లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాకెట్ బూస్టర్ సరైన విధంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదు. దాంతో పెద్దే సమస్యే నెలకొంది. ఎక్కడ పడుతుంది.. ఎంత ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతుందో అని అంతా కంగారు పడ్డారు. అయితే అది ఎలాంటి ప్రమాదం తలపెట్టకుండా హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. చైనా రాకెట్ శకలాలు హిందూ మహా సముద్రంలో […]
JWST: మానవాళిని మూఢనమ్మకాల నుండి ముందుకు తీసుకెళ్ళేదే సైన్స్. అలాంటిది ఈ టెక్నాలజీ మాత్రం మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది. అది కూడా కోట్ల సంవత్సరాల వెనక్కి. మరీ అంత వెనక్కి తీసుకెళ్తే మూఢ నమ్మకం అనుకుంటారేమో.. అని అనుకోకండి. ఈ టెక్నాలజీతో వెనక్కి వెళ్లడం కూడా ముందుకు వెళ్లడం కిందే లెక్క. ఈ సైన్స్ ఏంటి? వెనక్కి తీసుకెళ్లడం ఏంటి? ఆ టెక్నాలజీ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయాల్సిందే. సైన్స్ పుట్టిన మొట్టమొదటి […]
ఇంటర్నేషనల్ డెస్క్- మరో గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోంది. ఐతే అది భూమికి అతి సమీపంలోంచి వెళ్తుందే కాని, మనకు ఎటువంటి హానీ జరగదని నాసా చెబుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద కట్టడం బుర్జ్ ఖలీఫా కంటే పెద్దదిగా ఉన్న ఒక గ్రహాశకలం భూమి వైపు దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. ఈ గ్రహశకలానికి 1994 పీసీ1గా నామకరణం చేశారు. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనుంది. […]
మానవుడే మహనీయుడు.. అని ఓ కవి అన్నట్టు.. మనిషి సాధించలేనిది ఏదీ లేదు అన్నట్టుగా ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ విశ్వాన్నే శాసిస్తున్నాడు. భూమి, సంద్రం, ఆకాశంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మూడేళ్ల క్రితం అంటే.. 2018లో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌక సూర్యుడి బాహ్య వాతావరణ పొర ‘కరోనా’ను తాకింది. 11 లక్షల డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతతో మండే అగ్నిగోళాన్ని శోధిస్తోంది. ఇది ఖగోళ […]