సినీ పరిశ్రమకు చెందిన వారి జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఏమీ ఉండవు. స్టార్‌డమ్ పక్కన పెడితే వాళ్లూ అందరిలాంటి మనుషులే. వాళ్లకీ కష్టాలుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌లో చాలా ఒడిదుడుకులు, మనస్ఫర్థలు ఉంటాయి.
80, 90ల నాటి హీరో, హీరోయిన్ల రేర్ పిక్స్, వాటి వెనుకున్న స్టోరీ గురించి తెలిస్తే.. ఇప్పటి తరం వాళ్లకి ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి అరుదైన చిత్రాలు, సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి.