ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి రాయల చెరువు పూర్తిగా నిండిపోయింది. ప్రమాదకర స్థాయిలో ఉన్న రాయల చెరువుకు గండి పడే స్థితికి చేరుకుంది. చాలాచోట్ల లీకులు రావడంతో అధికారులు అప్రమత్తమై వాటిని పూడుస్తున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఇక ప్రజా పోరాటాల్లో తనదైన శైలిలో సీపీఐ కార్యదర్శి నారాయణ స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలో చిత్తురూ జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.. […]