తెలుగు బుల్లితెరపై వచ్చిన జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్ గా పరిచయం అయ్యింది అనసూయ. తన అందం.. అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ కావడంతో వెండితెరపై ఛాన్సులు రాబట్టుకుంది. జబర్ధస్త్ షో కి గుడ్ బై చెప్పి ప్రస్తుతం సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది.