ఇండోనేషియాలో ఊహించని ప్రమాదం సంభవించింది. కదులుతున్న ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఊహించని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపుగా 14 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? మంగళవారం 240 మంది ప్రయాణికులతో కుంపాంగ్ నుంచి కలాబాహి వరకు ఓ ఓడ బయలుదేరింది. అయితే ప్రయాణంలో ఉండగానే ఉన్నట్టుండి ఆ ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు […]