జమ్మూకశ్మీర్‌లో తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఒక జవాన్ తన సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక ఉన్నతాధికారి కూడా ఉన్నారు. కతువా జిల్లాలోని సేవా-2 జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈ దారుణం జరిగింది. కతువా జిల్లాలోని బసోహ్లి ప్రాంతంలో ఉన్న సేవా-2 హైడల్ పవర్ ప్రాజెక్టుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో డ్యూటీ మార్పు […]