సరైన సమయంలో వైద్య సేవలు అందకుంటే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలే నిండు ప్రాణాలు తీస్తాయి. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన విషయంలో ఈ మరణాలు మరీ ఎక్కువగా చూస్తుంటాం. రోగానికి వైద్యం, మందులు ఉండి కూడా అవి అవసరమైన సమయంలో అందక ఎందరో గిరిజన బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. చిన్నపాటి వర్షాలకు వాగులు పొంగడంతో సరైన వంతెనలు లేక రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. ఆస్పత్రికి చేరేందుకు సరైన మార్గమో, వాహనమో లేకనే గిరిజనులు సాధారణ జ్వరాలతో చనిపోతుంటారు. […]