హైదరాబాద్ నగర శివార్లలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పార్కింగ్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ఈ ప్రమాదంలో ఏకంగా ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. బౌరంపేట బొడ్రాయి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నిలిపే పార్కింగ్ యార్డ్లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. రోజువారీ ట్రిప్పులు ముగించుకున్న […]