తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి అంటే మనలో రోగ నిరోధక శక్తి తగ్గిందని అర్ధం. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మన ఇంట్లో ఉండే వంట దినుసులనే ఉపయోగించుకోవచ్చు. వంటింటి దినుసుల్లో ఒక ముఖ్యమైన దినుసు మిరియాలు. అయితే.., మిరియాల్ని అందరూ వంటల్లో ఒక పదార్ధంగా వాడతారు తప్ప.. దానిలో ఉండే ఔషధ గుణాల గురించి గానీ, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి గానీ చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ ప్రయోజనాలేంటో చూద్దాం. ప్రతిరోజూ […]
ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన పెరుగుతోంది. డిజిటల్ లావాదేవీలకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం కూడా ఎక్కువయ్యింది. క్రెడిట్ కార్డుల్లో చాలా రకాలుంటాయి. అవసరం, వినియోగించే తీరును బట్టి కార్డును తీసుకోవాలి. ముఖ్యంగా తక్కువ ఛార్జీలతో ఎక్కువ ప్రయోజనాలుండే వాటిని ఎంపిక చేసుకోవాలి. కొన్ని కార్డులు రెస్టారెంట్లలో మరికొన్ని పెట్రోల్ బంకుల్లో ఇలా ఒక్కోరకం కార్డు ఒక్కోచోట ప్రత్యేక రాయితీలు ఇస్తాయి. మరికొన్ని కార్డుల్లో రివార్డు పాయింట్లు విమాన ఛార్జీగా మారతాయి. కొన్నేళ్ల క్రితం సిటీ […]
క్యాప్సికమ్ తినడానికి ఇప్పటి జనాలలో చాలామంది మొఖం విరుస్తారు. అటు టేస్ట్ పరంగానే కాదు ఆరోగ్య పరంగాను అధ్బుతాలు సృష్టిస్తుంది. ఒక్కసారి క్యాప్సికమ్ లోని పోషకాల సీక్రెట్ తెలుసుకుంటే క్యాప్సికమ్ వదిలిపెట్టరు. దీంట్లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీర బరువును తగ్గిస్తాయి. ఏజ్డ్ లుక్ ను దూరం చేస్తాయి. చర్మవ్యాధులను మటుమాయం చేస్తాయి. చర్మంపై ముడతలు చర్మం పొడిబారడం వంటి సమస్యలను క్యాప్సికమ్ ఈజీగా నయం చేస్తుంది. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ […]
తొలకరి జల్లులకు భూమిలోని వజ్రాలు బయటకు వస్తాయి. ఇది నిజం. ఎక్కడో కాదు – రాయలసీమలో. ముఖ్యంగా కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని పొలాల్లోని వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి. అవి దొరికితే చాలు లక్షాధికారి కోటీశ్వరుడు అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. దీంతో ప్రతీయేటా ఆ తొలకరిరాగానే వజ్రాల కోసం వేట ప్రారంభిస్తారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల వేటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కర్నూల్ జిల్లాలో […]
పసుపు లేనిదే శుభకార్యం ఉండదు. పసుపు రంగు ఆనందానికి చిహ్నం. హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు అనేది శుభానికి గుర్తు. ఆరోగ్యాన్ని కలిగించే ఓ ఔషధి. సంపదను ఇచ్చే కల్పవల్లి. పసుపును మనం నిత్యం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. శుభకార్యాల్లోనూ ఎక్కువగానే ఉపయోగిస్తుంటాం. ప్రధానంగా పెళ్లి విషయానికి వస్తే ప్రతి సందర్భంలోనూ పసుపు వాడకం ఎక్కువే. ముఖ్యంగా వధూ వరులకు చేయించే మంగళ స్నానానికి ముందు వారికి పసుపు బాగా రాస్తారు. పసుపు మన చర్మానికి ఎంతో […]
చింత చచ్చినా పులుపు చావలేదు సామెతను వినే ఉంటారు. పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ […]
కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలపై కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయుర్వేద డాక్టర్లు ఓ ఆకును సూచిస్తున్నారు. దీనిని గుడూచి, అమృత అని కూడా పిలుస్తారు. ఈ ఆకులో ఎన్నో వైద్య లక్షణాలు ఉన్నాయి. దాన్నే సాధారణంగా మనం తిప్పతీగ అని పిలుస్తుంటాం. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను […]
రాగి పాత్రలో లేదా చెంబులో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు వాడుతున్నాం కానీ, పూర్వ కాలంలో రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటినే తాగే వారు. రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. రాగి పాత్రలో నిల్వ చేయబడిన నీటిని సేవించడం, భారతదేశంలో తరతరాలుగా పాటిస్తున్న పురాతన ఆచారం. రాగిపాత్రలో […]
మొక్కజొన్న గింజలు బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడక బెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు ‘పాప్ కార్న్’, ‘కార్న్ ఫ్లేక్స్’ తయారుచేస్తారు. లేత ‘బేబీ కార్న్’ జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. గింజల నుండి నూనె తీస్తారు. పశువుల దాణ, కోళ్ల దాణాగా ఉపయోగిస్తారు. బేకింగు పౌడర్ల తయారీలో వాడే పిండి పదార్థం రూపంలోను, అనేక రకాల మందుల తయారీలలోను, విస్కీ తయారీలోను మొక్కజొన్న […]
“సండే హో యా మండే, రోజ్ ఖావో ఆండే!..” రోజూ గుడ్లు తినడం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించేది గుడ్డు. పేదవాడికి ఇది మాంసంతో సమానం. తెలుపు రంగులో గుడ్డు చాలా సాధారణం. కానీ గోధుమ రంగులో గుడ్డు కనిపించడమే కొంచెం వెరైటీ. సూపర్ మార్కెట్లలో వీటిని చూసినపుడు చాలామందికి ఒక సందేహం వచ్చి ఉంటుంది. తెలుపు రంగు గుడ్డుకి, గోధుమ రంగు గుడ్డుకి ఏమైనా తేడా ఉంటుందా అని. సాధారణ […]