మహిళా ప్రీమియర్ లీగ్ వేలంలో లక్షల ధర పలికిన కర్నూల్ అమ్మాయి కేశవరాజుగారి అంజలి శర్వాణి. పలికింది లక్షల రూపాయలే అయినా ఒక తెలుగు బిడ్డగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు గర్వించదగ్గదే. దేశం తరుపున ఆడే క్రికెటర్ కు ప్రాంతీయ వాదం ముడిపెట్టడం సరైనదేనా..? అనుకోకండి. ఒక తెలుగుబిడ్డ సాధించిన విజయాన్ని అందరకీ తెలియజేయాలన్నా ఉద్దేశ్యమే ఈ కథనం.
టీమిండియాలోకి మరో తెలుగమ్మాయి అడుగుపెట్టబోతోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌కి ఆదోని అమ్మాయి ఎంపికైంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరగనుంది. డిసెంబర్ 9 నుంచి 20 వరకు ఈ సిరీస్ సాగనుంది. ఇందుకు సంబంధించిన మహిళా టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆ జట్టులో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తెలుగు అమ్మాయి అంజలి శర్వాణి పేరు కూడా ఉంది. టీమిండియాకి ప్రాతినిధ్యం వహించేందుకు అంజలి శర్వాణికి అవకాశం రావడంపై స్థానికంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. […]