వికారాబాద్ జిల్లా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అనంతగిరి ఘాట్ రోడ్డు వద్ద అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండ దిగుతుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో ముగ్గురు మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 54 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు పటాన్‌చెరు పరిధిలోని కేసారం గ్రామం నుండి తమ బంధువు అంత్యక్రియల కోసం […]