క్రికెట్ లో కొనసాగుతున్నంత కాలం క్రేజ్ ఉండడం కామన్. కానీ కొంతమందికి మాత్రం క్రికెట్ కి వీడ్కోలు పలికినా.. వారి పాపులారిటీ అలాగే ఉంటుంది. అలాంటి దిగ్గజాల లిస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ ఆసీస్ దిగ్గజం ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.
యాషెస్, డబ్ల్యూటీసీ ఫైనల్ మినహాయిస్తే టెస్టులకి పెద్దగా క్రేజ్ లేని మాట వాస్తవం. అయితే కొంతమంది ఆటగాళ్లకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండడడం వలన టెస్టు క్రికెట్ ఇంకా కొనసాగుతుంది. ఈ విషయం గురించి ఆసీస్ దిగ్గజం అలెన్ బోర్డర్ మాట్లాడుతూ.. కోహ్లీ మీద ప్రశంసలు కురిపించాడు.