క్రికెట్ లో కొనసాగుతున్నంత కాలం క్రేజ్ ఉండడం కామన్. కానీ కొంతమందికి మాత్రం క్రికెట్ కి వీడ్కోలు పలికినా.. వారి పాపులారిటీ అలాగే ఉంటుంది. అలాంటి దిగ్గజాల లిస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ ఆసీస్ దిగ్గజం ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.
క్రికెట్ లో కొనసాగుతున్నంత కాలం క్రేజ్ ఉండడం కామన్. కానీ కొంతమందికి మాత్రం క్రికెట్ కి వీడ్కోలు పలికినా.. వారి పాపులారిటీ అలాగే ఉంటుంది. వీరినే దిగ్గజాలు అంటారు. అలాంటి దిగ్గజాల లిస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ కూడా ఒకరు. ఆస్ట్రేలియా క్రికెటర్ బోర్డర్ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని గతంలో ఒక వెలుగు వెలిగాడు. అప్పట్లో రికార్డులన్నీ ఈ దిగ్గజ క్రికెటర్ మీదే ఉండేవి. కెప్టెన్ గా, బ్యాటర్ గా ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ ఆసీస్ దిగ్గజం నేడు ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తాను మరింత కాలం బ్రతకలేను అని తనకు తాను చెప్పుకోవడం చాలా విచారకరం. ఇటీవలే తన ఫ్రెండ్ డాక్టర్ ఈ విషయాన్ని నిర్దారించగా.. బోర్డర్ చేసిన ఈ వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి.
1974 లో తన క్రికెట్ కెరీర్ మొదలు పెట్టిన బోర్డర్ 1994 వరకు తన ప్రయాణాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించాడు. ఒక కెప్టెన్ గా ఆస్ట్రేలియాకి తొలిసారి 1987 లో వరల్డ్ కప్ అందించిన ఘనత బోర్డర్ కే దక్కుతుంది. ఇక వ్యక్తిగతంగా సునీల్ గవాస్కర్ తర్వాత టెస్టుల్లో 10 వేల పరుగులు అందుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 150కి పైగా టెస్టులు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచిన బోర్డర్.. టెస్టుల్లో 27 సెంచరీలతో 11,174 పరుగులు చేసాడు. ఇక వన్డేల్లో 3 సెంచరీలతో 6524 పరుగులు చేశారు. అంతేకాకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా టెస్టుల్లో 39, వన్డేల్లో 73 వికెట్లు తీశాడు. ఇంతటి ఘన కీర్తి కలిగిన బోర్డర్ ప్రస్తుతం పార్కిన్సన్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని చెప్పుకోవడానికి బోర్డర్ ఏమి వెనుకాడలేదు.
బోర్డర్ త్తనకు వచ్చిన వ్యాధి గురించి మాట్లాడుతూ.. “నేను చాలా సింపుల్ గా ఉంటాను. ఒంటరిగా ఉండడం నాకు అలవాటే. ఈ విషయం తెలిసినా జనాలు నాపై ఎలాటి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరేమనుకుంటున్నా నేను పట్టించుకోను. కొన్నిరోజుల తర్వాత జనాలకు ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు ఈ విషయాన్ని దాచినందుకు నేను బాధపడకూడదు. నాకిప్పుడు 68 ఏళ్లు. నేను 80 ఏళ్ల దాకా బతికితే అది అద్భుతమే. నాకు ఓ డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను కూడా ఇదే చెప్పాడు. అయితే బతికింతకాలం సంతోషంగా ఉండాలనే అనుకుంటున్నా” అంటూ కామెంట్ చేశాడు అలెన్ బోర్డర్.