అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ మద్యం మరోసారి పెను విషాదాన్ని మిగిల్చింది. ఏదో సరదాగా, అలసట తీర్చుకోవడానికి సేవించిన ఆ మద్యమే మృత్యుపాశమై ఏకంగా పన్నెండు మందిని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు, మరో 180 మందిని తీవ్ర అస్వస్థతకు గురిచేసి ఆస్పత్రి పడకలకు పరిమితం చేసింది. మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ వరుస మరణాలు ఇప్పుడు యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఒక్కసారిగా ఇంతమంది వాంతులు, కడుపునొప్పి, కంటిచూపు మందగించడం వంటి […]