ప్రేమోన్మాదం మరోసారి పడగవిప్పింది. ప్రేమించిన యువతి ప్రాణాలను తీయడమే లక్ష్యంగా ఓ ప్రేమోన్మాది చేసిన ఘాతుకం విజయవాడలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియురాలిపై పెంచుకున్న గుడ్డి అనుమానం, చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని చావుబతుకుల మధ్యకు నెట్టింది. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కొంతకాలంగా మహాలక్ష్మి, చిన్నారావు అనే యువతీయువకులు ప్రేమలో ఉన్నారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో, ప్రియురాలు మహాలక్ష్మిపై చిన్నారావుకు విపరీతమైన అనుమానం పెరిగింది. ఆ అనుమానమే […]