ఈజిప్టులోని గిజాలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. రెండో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోతున్న ఓ బాలుడిని ఓ యువకుడు అద్భుతమైన సమయస్ఫూర్తితో కాపాడాడు. ప్రాణాలకు తెగించి ఆ పసి ప్రాణాన్ని నిలబెట్టిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ యువకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
గిజాలోని అర్ద్ ఎల్-లెవా ప్రాంతంలో అహ్మద్ రగబ్ అనే యువకుడు ఓ దుకాణం దగ్గర నిల్చుని ఉన్నాడు. ఇంతలో సమీపంలోని భవనం నుంచి కేకలు, ఏడుపులు వినిపించడంతో అటువైపు చూశాడు. క్షణాల వ్యవధిలో ఓ బాలుడు రెండో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు జారిపోవడాన్ని గమనించాడు. వెంటనే తేరుకున్న రగబ్, ఆ బాలుడు పడే ప్రదేశం వైపు పరుగెత్తాడు. ఈ నాటకీయ ఘటనకు సంబంధించిన వీడియోలో రగబ్ వెంటనే స్పందించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. బాలుడు కింద పడే క్రమంలో మొదట ఓ వాషింగ్ లైన్ పై పడ్డాడు. ఇది బాలుడి కిందపడే వేగాన్ని కొద్దిగా తగ్గించడంతో రగబ్‌కు అతడిని పట్టుకోవడానికి కొంచెం టైం దొరికింది. అతను నేరుగా నేలపై పడకముందే రగబ్ చాకచక్యంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బాలుడిని కాపాడిన వెంటనే చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.
ఇక దీనిపై రగబ్ స్పందించారు… అదంతా క్షణాల్లో జరిగిపోయిందని.. తన ప్రాణాల గురించి ఆలోచించే సమయం కూడా నాకు లేదు. ప్రమాదంలో ఉన్న పిల్లాడిని చూసిన వెంటనే నా శరీరం దానంతట అదే స్పందించింది” అని చెప్పాడు. బాలుడు సురక్షితంగా ఉన్నాడని తెలిశాకే పరిస్థితి ఎంత తీవ్రమైనదో తనకు అర్థమైందని అతను చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అంత వేగంగా స్పందించి బాలుడిని ఎలా పట్టుకోగలిగానో తనకే తెలియడం లేదని, మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే అదే విధంగా చేయగలనో లేదో చెప్పలేనని రగబ్ చెప్పుకొచ్చాడు.. మరోపక్క ఈ వీడియో ఈజిప్టు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో నెటిజన్లు రగబ్‌ను ‘రియల్ హీరో’ అంటూ కొనియాడుతున్నారు. అతని సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే, ఈ ప్రశంసలను రగబ్ సున్నితంగా తిరస్కరించాడు. ఆ సమయంలో నా ఏకైక ఆలోచన ఆ పిల్లాడిని నేలపై పడకుండా ఆపడమే” అని చెప్పాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని రగబ్ విజ్ఞప్తి చేశాడు.
🇪🇬 𝐒𝐨𝐦𝐞𝐭𝐢𝐦𝐞𝐬, 𝐚 𝐬𝐩𝐥𝐢𝐭-𝐬𝐞𝐜𝐨𝐧𝐝 𝐜𝐚𝐧 𝐜𝐡𝐚𝐧𝐠𝐞 𝐚 𝐥𝐢𝐟𝐞 𝐟𝐨𝐫𝐞𝐯𝐞𝐫.
In Giza, Egypt, Ahmed Ragab heard screams and looked up to see a little boy, around four years old, falling from a second-floor balcony.
The child briefly became tangled in a washing line, slowing his fall just enough for Ahmed to react. Without hesitation, he ran underneath and caught the boy in his arms, saving him from a potentially tragic fall.
Then came the most human moment. Once the child was safe, Ahmed sat down against a mattress in the street, visibly shaken, as the reality of what had just happened began to sink in.
“I had no time to think or calculate the risks. All I wanted was to save this child.”
Sometimes instinct takes over before fear has a chance to speak, and one quick reaction can change everything. ❤️
— Rula El Halabi (@Rulaelhalabi) October 4, 2026
