ఈజిప్టులోని గిజాలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. రెండో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోతున్న ఓ బాలుడిని ఓ యువకుడు అద్భుతమైన సమయస్ఫూర్తితో కాపాడాడు. ప్రాణాలకు తెగించి ఆ పసి ప్రాణాన్ని నిలబెట్టిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ యువకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గిజాలోని అర్ద్ ఎల్-లెవా ప్రాంతంలో అహ్మద్ రగబ్ అనే యువకుడు ఓ దుకాణం దగ్గర నిల్చుని ఉన్నాడు. ఇంతలో సమీపంలోని భవనం నుంచి […]