ఇంట్లో ఉండే టాయిలెట్ల డోర్లు పూర్తిగా ఉంటాయి. లోపల ఉన్నవి, ఉన్న వారు బయటకి కనిపించే అవకాశం ఉండదు. కానీ పబ్లిక్ టాయిలెట్స్ విషయానికొస్తే కింద నుంచి కొంత గ్యాప్ అనేది ఉంటుంది. చాలా వరకూ పబ్లిక్ టాయిలెట్లు ఇలా గ్యాప్ తో ఉంటాయి. దీనికి కారణం ఏంటో తెలుసా?
పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కొన్ని టాయిలెట్ల కింద ఖాళీ ఉంటుంది. లోపల ఉన్న వారి కాళ్ళు బయటకు కనిపిస్తాయి. సినిమాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు చూసే ఉంటారు. బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి లోపల టాయిలెట్ కమోడ్ మీద కూర్చున్న వ్యక్తి ప్యాంటు లాగేయడం, ఆ వ్యక్తితో మాట్లాడడం వంటి సన్నివేశాలను చూసాం. పాశ్చాత్య దేశాల్లో టాయిలెట్లు ఇలానే ఉంటాయి. మన దేశంలో కూడా వెస్టర్న్ కల్చర్ ను ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? టాయిలెట్లు కింది భాగంలో ఎందుకు అంత ఖాళీ ఉంటుందో అని. ఎవరైనా కావాలని కిందకు ఒంగొని చూస్తే ఏంటి పరిస్థితి? అయినా గానీ ఎందుకు కింద అంత గ్యాప్ ఉంచారు?
అయితే ఇలా గ్యాప్ ఉంచడానికి కారణం.. ఎవరైనా టాయిలెట్ కి వెళ్ళినప్పుడు స్పృహ తప్పి పడిపోయినా, ఏదైనా ప్రమాదానికి గురైనా, అకస్మాత్తుగా ఫిట్స్ రావడమో, గుండెపోటు రావడమో వంటివి తలెత్తితే వెంటనే కాపాడే వీలు కోసం కింద గ్యాప్ ఉంచుతారు. అత్యవసర పరిస్థితుల్లో లోపల ఉన్న మనిషిని కాపాడడం కోసం తలుపు కింది భాగంలో ఖాళీ ఉంచుతారు. అలానే పరిశుభ్రత కారణంగా కూడా డోర్ల అడుగుభాగంలో ఖాళీ ఉంచుతారు. ఫ్లోర్ శుభ్రం చేసే క్లీనర్లకు సులువుగా ఉండడం కోసం ఖాళీ ఉంచుతారు. రోజంతా చాలా మంది పబ్లిక్ టాయిలెట్స్ ని వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో వాసన రాకుండా ఉండడం కోసం పదే పదే శుభ్రం చేయవలసి వస్తుంది.
ఒక టాయిలెట్ లోపలకు బకెట్ తీసుకెళ్లి శుభ్రం చేయడం, మళ్ళీ బయటకు వచ్చి ఇంకో టాయిలెట్ లోకి వెళ్లి శుభ్రం చేయడం కష్టం మరియు ఆలస్యమవుతుంది. అదే డోర్ కింద ఖాళీ ఉండడం వల్ల శుభ్రం చేయడం సులువుగా ఉంటుంది. అందుకే ఖాళీ ఉంచుతారు. మరో కారణం కూడా ఉంది. టాయిలెట్ లో కొంతమంది కక్కుర్తి గాళ్ళు ఉంటారు. ఎక్కడా చోటు లేనట్టు టాయిలెట్ రూమ్స్ లో శృంగారం చేసుకుంటారు. విదేశాల్లో ఈ ట్రెండ్ బాగా ఎక్కువ. టాయిలెట్ లో ఎక్కడ శృంగారం చేసుకుంటారో అని ముందు చూపుతో ఇలా డోర్ కింద ఖాళీ ఉంచారు. రెండు కాళ్ళు ఉండాల్సింది, నాలుగు కాళ్ళు కనబడితే.. ‘ఏ యూ’ అంటూ అక్కడే పరువు తీసిపడేస్తారు.
అలానే డ్రగ్స్ వాడే వాళ్లు టాయిలెట్స్ ని అడ్డాగా చేసుకుని మత్తులో మునిగితేలుతుంటారు. ఎవరికైనా అర్జెంటుగా టాయిలెట్ వెళ్లాలనుకుంటే లోపలున్న మత్తుబాబు బయటకి రాడు. రమ్మంటే గోల గోల చేస్తాడు. ఆ సమయంలో ప్యాంటు జేబులోంచి గన్ తీసి కాలిస్తే దిక్కులేని చావు చావాలి. అందుకే ఇలాంటి ఉపయోగం లేని సదుపాయాలు ఉండకూడదనే కింద ఖాళీ ఉంచుతారు. బయట నుంచి చూసినప్పుడు లోపలున్న వ్యక్తి తేడాగా ఉన్నారనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. శృంగారం, డ్రగ్స్ వాడకం వంటి అసాంఘిక ఘటనలు జరక్కుండా ఉండడం కోసం ఇలా సెట్ చేస్తారు.
ఇక సులువుగా తయారు చేయడం, ఖర్చు తగ్గించడం కోసం, సులువుగా రవాణా చేయడం కోసం, కొనుగోలు వంటివి సులభంగా ఉండడం కోసం ఇలా ఖాళీ ఉంచుతారట. అలానే డోర్ కింద ఖాళీ ఉండడం వల్ల లోపల దుర్వాసన అనేది రాదు. గ్యాప్ ఉండడం వల్ల లోపల చెడు వాసన బయటకు సులభంగా వెళ్తుంది. తడి ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఆరిపోతుంటుంది. దీని వల్ల వైరస్ లు ఏర్పడవు. మరి టాయిలెట్స్ డోర్ కింద గ్యాప్ ఉంచడానికి గల కారణాలు మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి.