SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » unknown facts » How Rain Measure In Cms Unknown Facts

వర్షాన్ని సెం.మీ.లలో ఎలా కొలుస్తారు? ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ అంటే ఏంటి?

2 సెం.మీ., 5 సెం.మీ.వర్షపాతం నమోదైందని అంటారు. ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. అసలు వర్షాన్ని ఎలా కొలుస్తారు? ఎన్ని సెం.మీ. వర్షపాతం నమోదైతే రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేస్తారు? మోస్తరు, భారీ, అతి భారీ వర్షాలను ఎలా లెక్కిస్తారు?

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 2 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వర్షాన్ని సెం.మీ.లలో ఎలా కొలుస్తారు? ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ అంటే ఏంటి?

ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమవ్వడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గంట పాటు వర్షం కురిస్తే ఆయా వీధులు, రోడ్లు మునిగిపోయే పరిస్థితి. 5 సెం.మీ. వర్షానికే కాలనీలు మునిగిపోతున్నాయి. అది సరే 5 సెం.మీ. వర్షం అంటే ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా? వర్షం పడినప్పుడు 10 సెం.మీ. వర్షపాతం నమోదైందని, 20 సెం.మీ. వర్షపాతం నమోదైందని అంటారు. అసలు ఈ వర్షపాతాన్ని సెం.మీ. లలో ఎలా కొలుస్తారో అని ఎప్పుడైనా ఆలోచించారా? సెం.మీ. లతో వర్షాన్ని ఎలా కొలుస్తారు? ఏముంది ఒక స్కేల్ ని తీసుకెళ్లి వర్షం పడ్డ బురద గుంటలో ముంచేస్తే సరి అని అనుకుంటున్నారా? వర్షపాతాన్ని లెక్కించడానికి కొన్ని ప్రామాణిక పద్ధతులు ఉన్నాయి.

Advertisement

వర్షపాతాన్ని అంచనా వేయడం అనేది పురాతన కాలం నుంచే ఉంది. 3 వేల ఏళ్లకు ముందు రాసిన చందోయా ఉపనిషత్తులో మేఘాల నిర్మాణం, వర్షాలు, సూర్యుని చుట్టూ భూమి తిరిగే సమయంలో ఏర్పడే ఋతువుల గురించి పేర్కొన్నారు. వరాహమిహిర రాసిన బృహత్ సంహితలో వాతావరణం గురించి స్పష్టంగా ఉంటుంది. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వర్షపాతాన్ని కొలిచే విధానాల గురించి తెలుపబడింది. మధ్య భారతదేశంలో వర్షాలు రుతుపవనాలు ఎప్పుడు మొదలవుతాయి అనే దాని గురించి కాళిదాసు రాసిన మేఘదూత అనే కథలో వివరించారు. ప్రస్తుతం అయితే ఐఎండీ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గాజ్ లాంటి పరికరాలను ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. ఈ సమాచారాన్ని నేషనల్ క్లైమేట్ సెంటర్ కు పంపిస్తారు.

వర్షపాతం అంచనా వేయడంలో పీడనం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పీడనం ఏర్పడడంలో ఉష్ణోగ్రత కీలక పాత్ర వహిస్తుంది. పీడనాన్ని బారోమీటర్, ఉష్ణోగ్రతను థర్మోమీటర్ తో కొలుస్తారు. రెయిన్ గాజ్ ను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. గాజు సీసాలో ఒక గాజు గరాటు ఉంటుంది. దీని మీద మిల్లీమీటర్, సెంటీమీటర్ కొలతలు ఉంటాయి. వర్షం పడినప్పుడు గరాటు ద్వారా నీళ్లు గాజు సీసాలోకి వెళ్తాయి. ఆ నీళ్లు ఎంత ఎత్తున చేరితే అన్ని సెం.మీ. లేదా అన్ని మి.మీ. వర్షం పడినట్లు. ఉదాహరణకు గరాటులో ఉన్న 10 సెం.మీ. కొలతకు వర్షం నీరు చేరితే 10 సెం.మీ. వర్షపాతం నమోదైందని చెబుతారు. ఈ లెక్కల ఆధారంగా వర్షాన్ని తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షం, భారీ, అతి భారీ వర్షాలుగా పిలుస్తారు.

Measuring rain details

15.6 మి.మీ. లేదా 1.56 సెం.మీ. నుంచి 64.4 మి.మీ. లేదా 6.44 సెం.మీ. వర్షపాతం నమోదైతే దాన్ని మోస్తరు వర్షం అని అంటారు. 64.5 మి.మీ. లేదా 6.45 సెం.మీ. వర్షపాతం నమోదైతే దాన్ని భారీ వర్షంగా పరిగణిస్తారు. 115.6 మి.మీ. లేదా 11.56 సెం.మీ. వర్షపాతం నమోదైతే దాన్ని అతి భారీ వర్షం అంటారు. 20.45 సెం.మీ. లేదా 204.5 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని కుంభవృష్టి అంటారు. ఈ వర్షపాతాన్ని కొలిచే రెయిన్ గాజ్ లను చెట్ల కింద, భవనాల సమీపంలో, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయరు. విశాలంగా ఉండే ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. అప్పుడైతేనే ఖచ్చితమైన లెక్కలు వస్తాయి. ఈ లెక్కల ఆధారంగా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది.

గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ లను పంపిస్తుంది. రెడ్ అలర్ట్ అంటే రాగల 24 గంటల్లో కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని అర్థం. అంటే 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. అధికారులు సిద్ధంగా ఉండాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. పరిస్థితులను జాగ్రత్తగా గమనించమని చెప్పడానికి ఈ ఎల్లో అలర్ట్ సూచిస్తుంది. ఇక తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటే గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు. గ్రీన్ అలర్ట్ అంటే నో వార్నింగ్ గా చెబుతారు. ఈ అలర్ట్ ఇచ్చినప్పుడు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

Tags :

  • heavy rains
  • unknown facts
Read Today's Latest unknown factsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన వర్షాలు.. శిథిలాల కింద ఇంకా 13 మంది..

    హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన వర్షాలు.. శిథిలాల కింద ఇంకా 13 మంది..

  • వీడియో: చేపలు పట్టేందుకు ఎగబడ్డ జనం

    వీడియో: చేపలు పట్టేందుకు ఎగబడ్డ జనం

  • బ్రేకింగ్: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం!

    బ్రేకింగ్: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం!

  • ఎంత కష్టమొచ్చింది.. చిన్నారిని ఆస్పత్రికి తరలించేందుకు గిరిజనుల కష్టాలు..

    ఎంత కష్టమొచ్చింది.. చిన్నారిని ఆస్పత్రికి తరలించేందుకు గిరిజనుల కష్టాలు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • మియాపూర్‌ హోటల్‌లో మెడికో మృతి.. వెలుగులోకి కీలక విషయాలు

  • వికారాబాద్‌లో లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి

  • 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన కుమ్‌కుమ్ మోహోడ్.. ఆసియా గేమ్స్ ఆర్చరీలో గోల్డ్

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam