రోడ్డు మీద నడుస్తున్నాం.. మన కళ్లేదురుగా ఏదో ప్రమాదం జరిగింది.. యాక్సిడెంట్ అయ్యింది.. రక్తపు మడుగులో పడి ఉన్నారు.. రోడ్డు మీద ఏదో గొడవ జరుగుతుంది.. ఒకరినొకరు కొట్టుకున్నారు.. గాయపడ్డారు.. ఇలాంటి సీన్లు చూడగానే.. అందరికి వెంటనే గుర్తుకువ వచ్చేది.. 108. ఈ నంబర్‌కు డయల్ చేస్తే.. చాలు.. కుయ్‌కుయ్ మంటూ వచ్చి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. వారి ప్రాణాలు కాపాడుతుంది. అంబులెన్స్ సర్వీస్ లేకపోతే.. రోడ్డు ప్రమాదాలు వంటి సంఘటనల్లో మృతుల సంఖ్య మరింత పెరిగేది అనే దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. సరిగా చెప్పాలంటే.. ప్రమాదాల్లో గాయపడిని వారికి 108 అనేది సంజీవని వంటిది అని చెప్పవచ్చు. మరి అంబులెన్స్ సర్వీస్‌కు 108 అనే నంబర్‌ను ఎందుకు పెట్టారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. దీని వెనక ఓ ఆసక్తికర అంశం ఉంది. ఆ వివరాలు..
భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. అన్ని మతాలు, ప్రాంతాలు, కులాల ప్రజలు కలసిమెలసి జీవిస్తున్నారు. ఇక హిందూ సంప్రదాయంలో 108 అనే నంబర్‌కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ 108 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆలాయాల్లో దేవుడికి ప్రత్యేక పూజలు లాంటి నిర్వహిస్తే..108 సార్లు పూలు వంటివి సమర్పిస్తారు. అలానే జపమాలలో కూడా 108 పూజలుంటాయి. 108 సార్లు దేవుడిని జపిస్తే.. దీంతో ఆనందం, శాంతి, సౌభాగ్యం ఆధ్యాత్మికత భావన కలుగుతాయంటుంటారు. అలానే అన్ని మతాల్లో.. 108కు ఎంతో ప్రాముఖ్యత ఉంది
శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంటల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటారు. అంటే 12 గంటల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడని లెక్క. ఈ లెక్క ప్రకారం మనిషి శ్వాస తీసుకునే ప్రతి సారి దేవుడిని తలచుకోవాలంటే.. 10800 సార్లు చేయడం దైవనామ స్మరణ చేయాలి. కానీ అలా చేయడం కష్టం కనుక.. చివర ఉన్న రెండు సున్నాలు తీసివేసి 108ను ప్రామాణికంగా ఉంచారని కొంత మంది పెద్దలు చెబుతుంటారు.
సైకాలజి పరంగా కూడా ఈ 108 సంఖ్యకు ప్రత్యేకత ఉంది. మనిషి నిరాశ, డిప్రెషన్‌లో ఉన్న సమయంలో వారి చూపు మొబైలులో ఎడమ భాగం వైపున చివరికి వెళ్తుందట. అయితే అక్కడ 0,8 దగ్గరగా ఉండడం వల్ల 108 ని ఎమర్జెన్సీ నంబర్‌గా ఎంచుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇంకొక కథనం ప్రకారం తొలి సంఖ్య అయిన 1 మగవారిని,0 ఆడవారిని సూచిస్తాయని ఇక 8వ నంబర్ ఇన్ఫినిటీ సూచిస్తుందని.. అందువల్లే. అంబులెన్స్ కు 108 సంఖ్యని ఉపయోగిస్తున్నారని కొందరు చెబుతారు.