హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అందరికీ గుర్తొచ్చేది 108 అంబులెన్సే. ప్రమాదాలు అయినప్పుడు కూడా తొలుత ఈ నంబర్‌కే కాల్ చేస్తుంటారు. అయితే అంబులెన్స్ ఎంతసేపట్లో ఘటనా స్థలానికి వస్తుందనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రోడ్డు మీద నడుస్తున్నాం.. మన కళ్లేదురుగా ఏదో ప్రమాదం జరిగింది.. యాక్సిడెంట్ అయ్యింది.. రక్తపు మడుగులో పడి ఉన్నారు.. రోడ్డు మీద ఏదో గొడవ జరుగుతుంది.. ఒకరినొకరు కొట్టుకున్నారు.. గాయపడ్డారు.. ఇలాంటి సీన్లు చూడగానే.. అందరికి వెంటనే గుర్తుకువ వచ్చేది.. 108. ఈ నంబర్‌కు డయల్ చేస్తే.. చాలు.. కుయ్‌కుయ్ మంటూ వచ్చి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. వారి ప్రాణాలు కాపాడుతుంది. అంబులెన్స్ సర్వీస్ లేకపోతే.. రోడ్డు ప్రమాదాలు వంటి సంఘటనల్లో మృతుల సంఖ్య మరింత పెరిగేది […]